వైజాగ్ కాలనీ... తెలంగాణాలో సీక్రెట్ బీచ్ ఇది

బీచ్ చూడాలంటే వైజాగ్‌కో, మచిలీపట్నానికో వెళ్లక్కర్లేదు. తెలంగాణవారి కోసం నల్గొండలోనూ బీచ్ ఉంది.

హైదరాబాద్ - నాగార్జున సాగర్ మార్గంలో మల్లేపల్లి నుంచి వెళితే 32 కిలోమీటర్ల దూరంలో ఉంది వైజాగ్ కాలనీ.

ఆ ఊరికి వెళుతున్న దారంతా పచ్చదనంతో నిండిపోతుంది. అందుకే ఇప్పుడు ఎక్కువమంది పర్యాటకానికి అటే వెళుతున్నారు.

వైజాగ్ కాలనీలో ఉండే వారంతా మత్స్యకారులే. వీరంతా విశాఖ, మహారాష్ట్ర, ఒడిశా నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు.

ఇక్కడికి వచ్చే పర్యాటకులు బోటింగ్ ను బాగా ఎంజాయ్ చేస్తారు.

స్థానికుల చేత తాజా చేపలతో పులుసు, కూరలు, వేపుళ్లు చేయించుకుని తింటారు.

ఆదివారం అయితే ఊరంతా పర్యాటకుల వాహనాలతో నిండిపోతుంది.

వైజాగ్ కాలనీ చుట్టు పక్కల ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. రాక్షసగుళ్లు, ఆదిమమానవుల గుహలు, శివాలయం వంటి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.

ఇది అమ్రబాద్ అభయారణ్యంలో భాగంగా ఉంది, కాబట్టి జంతువులు కూడా అప్పుడప్పుడు దర్శనమిస్తుంటాయి.