‘రాజా రాణి’ సినిమాతో కుర్రాళ్ల మనసు దోచుకుంది నజ్రియా.

‘రాజా రాణి’లో అల్లరి పిల్లగా, చిలిపి ప్రియురాలిగా భలే ఆకట్టుకుంది నజ్రియా.

ఆ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేయడం వల్లే ఆమె మనకు పరిచయమైంది.

ఇప్పటివరకు ఒక్క తెలుగు సినిమాలో కూడా నజ్రియా నటించలేదు.

సుమారు తొమ్మిదేళ్ల తర్వాత నజ్రియా నేరుగా తెలుగు చిత్రంలో నటించింది.

ఆమె నటించిన ‘అంటే, సుందరానికి’ సినిమా శుక్రవారం థియేటర్లో విడుదలైంది.

‘అంటే సుందరానికి..’ పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది.

నజ్రియా 2014లో ‘పుష్ప’ స్టార్ ఫహాద్ ఫసిల్‌ను పెళ్లి చేసుకుంది.

‘అంటే సుందరానికి’ విజయంతో మరిన్ని తెలుగు చిత్రాల్లో ఆమెకు నటించాలని ఉండట.

నజ్రియా టాలీవుడ్ సినిమాలు చేస్తే బ్రేక్ ఇవ్వడానికి తాము సిద్ధమని ప్రేక్షకులు అంటున్నారు.