వాస్తు ప్రకారం అక్వేరియం ఎక్కడ పెట్టాలి?



అక్వేరియం పెడితే మంచిది..అందుకే పెట్టాం అంటే సరిపోదు. ఏ దిశగా ఉంచాలన్నది కూడా చూసుకోవాలి. వాస్తుకు తగ్గట్టుగా సరైన ప్రదేశంలో ఉంచాలి



సొంతిల్లు కదా అని అక్వేరియం ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే మీ ఇల్లు గుల్లైపోతుంది



అక్వేరియం ఉంచాల్సిన సరైన ప్రదేశం డ్రాయింగ్ రూమ్...అక్కడ కూడా వాస్తు ప్రకారం తూర్పు దిశగా కాని, ఉత్తర దిశగా కాని ఉండాలి



రాత్రిళ్లు అందంగా కనిపిస్తుంది కదా అని బెడ్ రూమ్ లో ఉంచితే దంపతుల మధ్య , కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతాయి



వంటింట్లో ఉంచితే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది



అక్వేరియం ఎదురుగా దుష్ట జంతువుల బొమ్మలు అస్సలు ఉంచొద్దు. డ్రాగన్, పులి, అనకొండ, సింహం వగైరా వగైరా బొమ్మలు.



సమయానికి తగ్గట్టుగా అక్వేరియంలోని పాత నీరును తీసేసి కొత్త నీరును నింపుతుండాలి



ఇంట్లో కానీ, కార్యాలయంలో కానీ సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు ఆ ప్రదేశాల్లో వాస్తు నిబంధనల ప్రకారం అక్వేరియం ఉంచండి.



హిందూ పురాణాల ప్రకారం విష్ణుమూర్తి 9 అవతారాల్లో మత్స్యావతారం ఒకటి. అంటే భూమండలపై ఉన్న సకలచరాచర జీవులన్నీ పూజకు అర్హులే అని పురాణాల ఉద్దేశం.



సైన్స్ పరంగా చూస్తే చేపలు....నెగెటివ్ తరంగాలను తమలో ఇముడ్చుకుని చాలా చక్కటి అనుకూల తరంగాలను బయటికి విడుదల చేస్తుందట



ఇంట్లో అక్వేరియం ఉంటే ప్రతికూల ఆలోచనలు, నెగిటివ్ ఎనర్జీని తరిమికొడుతుంది



ఆర్థిక ఇబ్బందులు, సంతానలేమి సమస్యలకు చెక్ పెట్టి అదృష్టాన్ని అందిస్తుందట అక్వేరియం
(ImagesCredit: Pinterest)