మహేష్ బాబు, కీర్తీ సురేష్ జంటగా నటించిన 'సర్కారు వారి పాట' ఎలా ఉంది? ఒకసారి మినీ రివ్యూ చదవండి. కథ: అమెరికాలో మహి (మహేష్ బాబు)ను మాయ చేసిన కళావతి (కీర్తీ సురేష్) పదివేల డాలర్లు తీసుకుంటుంది. కథ: ప్రేమ పేరుతో తనను మోసగించినట్టు మహికి అర్థం అవుతుంది. కళావతిని డబ్బులు అడిగితే గొడవ పెట్టుకుంటుంది. కథ: కళావతి తండ్రి రాజేంద్రనాథ్ దగ్గర డబ్బులు వసూలు చేయాలని మహి ఇండియాకి వస్తాడు. తర్వాత ఏమైందనేది చిత్రకథ. ఎవరెలా చేశారు?: మహేష్ హ్యాండ్సమ్‌గా కనిపించారు. కీర్తీ సురేష్‌తో ప్రేమ సన్నివేశాల్లో కుర్రాడు అయిపోయారు. కీర్తీ సురేష్ నటనతోనూ, గ్లామర్‌తోనూ ఆకట్టుకుంటారు. సాంగ్స్‌లో మరింత అందంగా ఉన్నారు. మహేష్‌తో కెమిస్ట్రీ బావుంది. ఎవరెలా చేశారు?: మహేష్, 'వెన్నెల' కిశోర్ మధ్య సన్నివేశాల్లో కామెడీ టైమింగ్ కుదిరింది. సముద్రఖని ఓకే. సంగీతం: 'కళావతి', 'మ మ మహేశా' పాటలు తెరపై కూడా బావున్నాయి. అయితే, నేపథ్య సంగీతం విషయంలో తమన్ నిరాశపరిచారు. ఛాయాగ్రహణం: ప్రతి ఫ్రేమ్‌ను మది అందంగా చూపించారు. అయితే, కొన్ని సీన్స్‌లో విజువల్ ఎఫెక్ట్స్ బాలేదు. దర్శకత్వం: మహేష్ క్యారెక్టరైజేషన్ మీద దృష్టి పెట్టిన పరశురామ్... కథపై అంత వర్క్ చేయలేదు. లాజిక్స్ మిస్ అయ్యారు. సినిమా ఎలా ఉంది?: ఫస్టాఫ్‌లో మహేష్, కీర్తీ మధ్య సీన్స్ బావున్నాయి. సెకండాఫ్‌లో అసలు కథ మొదలయ్యాక గాడి తప్పింది. సినిమా ఎలా ఉంది?: లోన్ ఎగవేత, ఈఎంఐ కాన్సెప్ట్ బావున్నప్పటికీ... డీల్ చేయడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యారు. చివరగా: మహేష్ వన్ మ్యాన్ షో చేశారు. ఆయన కామెడీ టైమింగ్ సూపర్. సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు నచ్చుతుంది. ఫైనల్ టచ్: కామన్ ఆడియన్స్ కొత్త మహేష్‌ను చూడొచ్చు. థాంక్స్ ఫర్ రీడింగ్ (All Images Courtesy: Sarkaru Vaari Paata Movie Team)