సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠికి సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. ‘చావు కబురు చల్లగా’ సినిమా తర్వాత మళ్లీ అడ్రస్ లేదు. వరుణ్ తేజ్‌తో ప్రేమాయణమంటూ లావణ్య ఈ మధ్య వార్తల్లో ఉంటోంది. తాజాగా ఆమె ‘గని’ విడుదల సందర్భంగా వరుణ్‌కు విషెస్ చెప్పింది. దీంతో లావణ్య, వరుణ్ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నిజమే అని ఫ్యాన్స్ ఫిక్సైపోయారు. వాస్తవం ఏమిటనేది మాత్రం లావణ్యకే తెలియాలి. సినిమాలు తగ్గడంతో లావణ్య బొద్దుగా మారింది. ప్రస్తుతం లావణ్య బరువు తగ్గించుకొనే పనిలో ఉంది. బరువు తగ్గేందుకు లావణ్య జిమ్‌లో కష్టాలు పడుతోంది. లావణ్య ప్రస్తుతం తెలుగులో ‘హ్యాపీ బర్త్ డే’ సినిమాలో నటిస్తోంది. Images and Videos Credit: Lavanya Tripathi/Instagram