అసలేంటీ టమోటా ఫీవర్? కేరళలో మరో కొత్త వైరస్ వెలుగు చూసింది. అయిదేళ్ల లోపు పిల్లలపై ఇది దాడి చేస్తున్నట్టు గుర్తించారు ఆరోగ్య శాఖ అధికారులు. ఈ కొత్త వైరస్ వల్ల ‘టమోటా జ్వరం’, లేదా ‘టమోటా ఫ్లూ’వస్తున్నట్టు కనుగొన్నారు. కేరళలోని కొల్లం నగరంలో దాదాపు 82 కేసులు నమోదైనట్టు గుర్తించారు. ఇదొక వైరల్ ఇన్ఫెక్షన్.పిల్లలపైనే అధికంగా దాడి చేస్తుంది. ఇది వచ్చిన వారిలో చర్మంపై ఎర్రటి దద్దుర్లు, బొబ్బలు వస్తున్నాయి. చర్మంపై వచ్చే పొక్కులు, బొబ్బలు ఎర్రగా గుండ్రంగా ఉంటాయి, అవి టమోటోల్లా ఉంటాయని టమోట ఫీవర్ అని పేరు వచ్చింది. టమోటా ఫీవర్ వచ్చిన పిల్లల్లో జ్వరం అధికంగా ఉంటుంది. ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు కూడా కలుగుతాయి. విపరీతంగా అలిసిపోతారు. పిల్లలకి పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయద్దు. వెంటనే వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాలి.