మనదేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి హైబీపీ అధికరక్తపోటు ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు కారణమవుతోంది. కేవలం అధికరక్తపోటు వల్లే మరణిస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ‘ఇండియా హైపర్‌టెన్షన్ కంట్రోల్ ఇనిషియేటివ్ రిపోర్టు’లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. దేశంలో ఉన్న పెద్దవారిలో ప్రతి నలుగురిలో ఒకరికి హైబీపీ ఉన్నట్టు రిపోర్టు ద్వారా తెలుస్తోంది. అధిక రక్తపోటు తీవ్ర స్థాయిలో పెరిగితే తలనొప్పి అధికంగా వస్తుంది. నిద్ర పట్టకపోవడం, చూపు మసకబారడం, విపరీతమైన అలసట, చెవ్వుల్లో శబ్ధాలు వినిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడడం, గుండెల్లో దడగా అనిపించడం, తికమకగా అనిపించడం వంటివి హైబీపీ తీవ్రంగా ఉంటే కనిపించే సూచనలు. సాధారణ వ్యక్తిలో రక్తపోటు 120/80గా ఉంటుంది. హైపర్ టెన్షన్ బారిన పడిన వారిలో రీడింగ్ 130/90 కన్నా అధికంగా ఉంటుంది.