మేషం: రాశివారికి ఈ ఏడాదంతా మిశ్రమ ఫలితాలుంటాయి. అంటే మంచి-చెడు, జపం-అపజయం అన్నీ సమానంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలను మాత్రం సమర్థంగా నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో శుభఫలితాలున్నాయి.కష్టానికి తగిన ఫలితాలు సాధిస్తారు.
మేషం: వ్యాపారులకు కలిసొస్తుంది. కుటుంబసభ్యులతో విభేదాలు రాకుండా జాగ్రత్తపడండి. పరిస్థితిని అంచనా వేస్తూ మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ముందుకుసాగాలి. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులొస్తాయి. ఓర్పు చాలా అవసరం.
మేషం: విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు అవసరం. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. భార్య-భర్త మధ్య అన్యోన్యత తగ్గుతుంది. ఆరోగ్యాన్ని, ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఇతరుల వివాదాల్లో తలదూర్చకుండా మీపని మీరు చేసుకోండి.
వృషభం: ఈ ఏడాది వీరిపై గురుబలం అధికంగా ఉండడంతో అన్నింటిలోనూ పైచేయి సాధిస్తారు. అదృష్టం మీకు కేరాఫ్ అడ్రస్ గా మారుతుంది. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు, శత్రువులపై విజయం సాధిస్తారు. దైవనానుగ్రహం మీపై ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు.
వృషభం: ఉద్యోగపరంగా శ్రమకు తగిన గుర్తింపు తెచ్చుకుంటారు. దశమంలో శనివల్ల మానసిక ఒత్తిడి కలుగుతుంది. 12లో రాహువు వల్ల తెలియని ఖర్చులూ ఇబ్బందులూ ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులూ ఎదురవొచ్చు.
మిథునం: ఈ రాశి స్త్రీ పురుషులకు ధనం, కుటుంబం, సంపద, సంతానం, గౌరవానికి కారకుడైన గురుడు 10 వ స్థానంలో ఉన్నాడు. రాహువు 11 స్థానంలో ఉన్నాడు. శని 8వ స్థానంలో ఉన్నప్పటికీ..అంటే అష్టమశని నడుస్తున్నప్పటికీ అంతగా హానిచేయడు.
మిథునం: పెద్దహోదాగల వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అధికారం వహించే శక్తిసామర్థ్యాలు వీరిసొంతం.గురు, శని, కేతు దోషాలవల్ల అడుగడుగునా విఘ్నాలు ఎదురవుతాయి. తెలివిగా పనుల్ని పూర్తిచేయాలి.
మిథునం: వివాదాలకు దూరంగా ఉండాలి. వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగంలో శాంతం అవసరం. వ్యాపారం కలిసివస్తుంది. విద్యార్థులకు పరీక్షాకాలంగా అనిపిస్తుంది. ఆరోగ్యంపై దృష్టి సారించాలి.