మంచు విష్ణు ప్రస్తుతం ‘గాలి నాగేశ్వరరావు’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

ఈ చిత్రంలో సన్నీలియోన్ కూడా నటిస్తోంది.

విష్ణు సరసన పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ చిత్రం పబ్లిసిటీ కోసం విష్ణు ఫన్నీ వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు.

కొద్ది రోజుల కిందట సన్నీలియోన్‌తో ఆటలాడిన వీడియో పోస్ట్ చేశాడు.

తాజాగా పాయల్, సన్నీలను ఆటపట్టించే వీడియోను విష్ణు పోస్ట్ చేశాడు.

ఈ వీడియోలో సన్నీ లియోన్, రాజ్‌పుత్‌లో ఎవరు ఇష్టమో విష్ణు చెప్పాలి.

కానీ, విష్ణు వీరిద్దరు కాదు, అలియా భట్ అని చెబుతాడు.

దీంతో పాయల్, సన్నీ లియోన్‌లు విష్ణును తరిమి మరీ తలగడలతో కొట్టారు.

ఆ ఫన్నీ వీడియో ఇదే.

Images and Videos Credit: Vishnu Manchu/Instagram