చ్యవన్‌ప్రాష్ ఎప్పుడు తినాలి?

చ్యవన్‌ప్రాష్ రోజుకో స్పూను తింటే ఎంతో ఆరోగ్యమని చెబుతారు. ఇప్పటికీ దాన్ని కచ్చితంగా రోజూ తినే వారు ఉన్నారు.

చరిత్ర చెబుతున్న కథల ప్రకారం అది ఈనాటిది కాదు. కొన్ని వేల ఏళ్ల క్రితమే తయారైందని తెలుస్తోంది.

చ్యవనుడు అనే రుషి కోసం ఇద్దరు రుషులు దీన్ని తయారుచేశారని చెబుతారు. అతని పేరే ఈ మిశ్రమానికి పెట్టారు.

చ్యవన్‌ప్రాష్ అద్భుత మూలికల సమ్మేళనం. ఇందులో 40 రకాల ఔషధ మూలికలు ఉన్నట్టు సమాచారం.

ఉసిరి, బ్రహ్మి, తులసి, వేప, కేసర, పిప్పలి, అశ్వగంధ, గోక్షుర, తెల్ల చందనం, బ్రాహ్మి, పచ్చి యాలకులు, నెయ్యి, తేనె, అర్జున వంటి చాలా పదార్థాలు ఇందులో ఉన్నాయి.

చలికాలంలో రోజూ ఒక స్పూన్ చ్యవన్‌ప్రాష్ తీసుకోవడం మంచిది. పిల్లలకు, వయసు పెరిగిన వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది.

ఖాళీ పొట్టతో చ్యవన్ ప్రాష్ తినడం మంచిది. దీన్ని తిన్నాక రెండు గంటల పాటూ ఏ ఆహారాన్ని తినకపోవడం ఉత్తమం.

రాత్రి భోజనం చేశాక రెండు మూడు గంటల తరువాత చ్యవన్ ప్రాష్ తినాలి.