పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా అవసరం. అయితే ఇవి ఎప్పుడు ఎలా తినాలనే విషయం గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి.

అయితే పండ్లు తినేందుకు సరైన సమయం, ఇతర నియమాల గురించి నిపుణులు ఏం సూచిస్తున్నారో తెలుసుకుందాం.

రాత్రి పూట పండ్లు తింటే వాటిలోని చక్కెరలు కొవ్వుగా మారే ఆస్కారం ఎక్కువ. కనుక తరచుగా రాత్రి పూట పండ్లు తినకపోవడం మంచిది.

దాదాపు అన్ని పండ్లలోనూ చక్కెరలు ఉంటాయి. అవి ఆరోగ్యకరమైనవే.

కనుక శరరీం చురుకుగా పనిచేసేందుకు దోహదం చేస్తాయి. ఉదయం లేదా మధ్యాహ్న సమయాల్లో పండ్లు తీసుకోవాలి.

చాలా మంది పండును మిల్క్ షేక్ రూపంలో తీసుకోవడానికి ఇష్ట పడతారు కానీ అలా తీసుకోవద్దని నిపుణుల సూచన.

పండ్లు త్వరగా జీర్ణమవుతాయి. కానీ పాలు కాస్త ఎక్కువ సమయం తీసుకుంటాయి.

పండ్లలో ఉండే చక్కెరలు పాలతో కలిసినపుడు కడుపులో ఫర్మెంట్ అవుతాయి.

ఫలితంగా కడుపుబ్బరంగా ఉండడం, జీర్ణసమస్యలు రావచ్చు.

చాలా మందికి భోజనం తర్వాత పండ్లు తినే అలవాటు ఉంటుంది. అది కూడా వద్దని నిపుణుల సూచన.

భోజనం తర్వాత పండ్లు చేర్చుకుంటే జీర్ణవ్యవస్థ మీద భారం పడి చాలా సమయం పాటు అసౌకర్యంగా ఉంటుందట.

ఇక చివరగా పండెప్పుడు పూర్తి పండుగా తీసుకోవాలి. జ్యూసుల రూపంలో కాదు.

ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ సమాచారం చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు.

Images courtesy : Pexels