ఆ విషయంలో కుంగిపోయేది అబ్బాయిలే



అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలకు శక్తి ఎక్కువని, హార్డ్ గా ఉంటారని అంటారు.



నిజానికి తల్లిదండ్రులు మరణించినప్పుడు అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలే ఎక్కువగా కుంగిపోతారని చెబుతోంది కొత్త అధ్యయనం.



ముఖ్యంగా 21 ఏళ్లలోపు వయసు కలిగిన అబ్బాయిలు తల్లిదండ్రుల మరణాన్ని జీర్ణించుకోలేక తీవ్రంగా బాధపడతారని అంటోంది.



ఆడపిల్లలు మాత్రం ఎంతో కొంత ధైర్యంగా ఉంటారని పరిశోధన వివరిస్తోంది.



ఈ అధ్యయనం 30 ఏళ్లలోపు వయసున్న 14 లక్షల మంది అబ్బాయిలు, అమ్మాయిలపై నిర్వహించారు.



తల్లిదండ్రులు మరణిస్తే తమ భవిష్యత్తు ఏమవుతుందోనని భయంతో వారు ఒత్తిడికి గురవుతున్నట్టు అధ్యయనం చెబుతోంది.



అబ్బాయిలు మానసిక అనారోగ్యాల బారిన పడే అవకాశం కూడా ఎక్కువ.



కొంతమంది మగపిల్లలు డిప్రెషన్ బారిన పడి మానసిక ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నట్టు ఈ అధ్యయనం చెబుతోంది.