మీకు రిజెక్షన్ ట్రామా ఉందా?



మన అభిప్రాయాలు, మన భావాలు, మన నిర్ణయాలు ప్రతి ఒక్కరూ మెచ్చేలా ఉండాలని లేదు. కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు.



అలా తమ భావాలు, తమ నిర్ణయాలను తిరస్కరిస్తే ఎంతోమంది ఫీలవుతారు. మానసికంగా నలిగిపోతారు.



చిన్న తిరస్కరణను కూడా తట్టుకోలేని అలాంటివారు ‘రిజెక్షన్ ట్రామా’ (Rejection Trauma) బారిన పడినట్టే.



ఇదొక మానసిక రుగ్మత. దీన్ని రిజెక్షన్ సెన్సిటివ్ డిస్పోరియా (RSD) అని కూడా పిలుస్తారు. తీవ్రమైన భావోద్వేగ ప్రతిస్పందన ఇది.



ఒక వ్యక్తి మానసిక శ్రేయస్సుకు, ఆత్మ గౌరవానికి, సామాజిక జీవనానికి ఇంత ప్రతిస్పందన మంచిది కాదు.



ఈ రిజెక్షన్ ట్రామా బారిన పడిన వారు... ఎవరైనా తమ చెప్పిన విషయాన్ని ఒప్పుకోకపోతే లేదా విమర్శిస్తే చాలా సున్నితంగా మారిపోతారు.



ఎక్కువగా బాధపడి పోతారు. చిన్న చిన్న మాటలకే కుంగిపోతారు. అవమానంగా తీసుకుంటారు. విచారంగా ఉంటారు.



ఈ సమస్య ఉన్న వ్యక్తులు ఆకస్మికంగా తీవ్ర భావోద్వేగా మార్పులకు కారణం అవుతారు. కోపం, విచారం, ఆందోళన వంటివి వీరిలో చాలా త్వరగా వస్తాయి.



వీరు కచ్చితంగా మానసిక వైద్యులను కలిసి తగిన చికిత్సను పొందాలి.