వేడి వేడి సమోసా విత్ సాస్ తో తింటుంటే ఆహా ఏమున్నాయ్ అనిపిస్తుంది. మాన్ సూన్ సీజన్ లో వీటిని ఎక్కువగా లాగించేస్తుంటారు.



అయితే కేవలం వర్షాకాలంలో ఇలాంటి ఫుడ్ తినాలని ఎందుకు అనిపిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా?



వర్షాకాలంలో సూర్యరశ్మి లేకపోవడం వల్ల శరీరం సంతోషాన్ని కలిగే హార్మోన్లను ప్రభావితం చేస్తుంది.



మనకి సంతోషాన్ని కలిగించే హార్మోన్ సెరోటోనిన్ స్థాయిలు వర్షాకాలంలో తగ్గుముఖం పడతాయి.



ఈ హార్మోన్ల ఉత్పత్తిని పెంచే ఆహారాల కోసం మనసు ఆరాటపడుతుందని న్యూట్రీషనిస్ట్ చెప్తున్నారు.



అందుకు కారణం సరైన సూర్యకాంతి శరీరానికి తగలకపోవడం.
ఈ లోపాన్ని సర్దుబాటు చేసుకోవడం కోసం శరీరం కార్బోహైడ్రేట్లను కోరుకుంటుంది.


కార్బోహైడ్రేట్ తో పాటు డీప్ ఫ్రైడ్ స్నాక్స్ తింటే నోటికి క్రంచీగా రుచిగా అనిపిస్తాయి. ఇవి తింటే మనసుకి హాయి అనిపిస్తుంది.



మసాలా ఫుడ్ తినాలని అనిపించడానికి వెనుక ఒక శాస్త్రం కూడా ఉందని అంటున్నారు.



అదన్న మాట సంగతి అందుకే వర్షాకాలంలో వేడి వేడి స్పైసీ ఫుడ్స్ వైపు మనసు లాగేయడానికి కారణం.