కళ్ళు మూసుకుని కాసేపు వాటి మీద దోసకాయ ముక్కలు పెట్టుకోండి. ఇవి మీ కళ్లని శాంతపరుస్తాయి.



ఒక టీ స్పూన్ టొమాటో రసంలో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని డార్క్ సర్కిల్స్ ఉన్న ప్లేస్ లో అప్లై చేసుకోవాలి.



రెండు గ్రీన్ టీ బ్యాగ్ లని వేడి నీటిలో వేసి కొన్ని నిమిషాలు ఉంచాలి.
చల్లబడిన టీ బ్యాగ్ ని కళ్ళ మీద పెట్టుకోవాలి.


ఒక చిటికెడు పసుపు కొన్ని చుక్కల పాలు కలుపుకుని పేస్ట్ కళ్ళ కింద అప్లై చేసుకోవాలి.



నిద్రపోయే ముందు కళ్ల చుట్టూ కొన్ని చుక్కల బాదం నూనె రాసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.



కొద్దిగా దూది తీసుకుని రోజ్ వాటర్ లో నానబెట్టాలి. వాటిని కళ్ల మీద 10-15 నిమిషాలు ఉంచుకోవాలి.



దోసకాయ మాదిరిగానే కళ్ళపై బంగాళాదుంప ముక్కలు ఉంచుకోవచ్చు. లేదంటే దాని నుంచి రసాన్ని తీసి కళ్ల చుట్టు రాసుకోవచ్చు.



కాటన్ ప్యాడ్ ని చల్లటి పాలలో నానబెట్టి వాటిని 10-15 నిమిషాలు ఉంచుకోవాలి.