ప్రొబయోటిక్స్ తో నిండి ఉండే పెరుగు భారతీయుల ఆహారంలో ఒక భాగంగా ఉంటుంది.



కానీ కొన్ని సంప్రాదాయ విశ్వాసాల ప్రకారం వర్షాకాలంలో పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు.



ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల పిత్త, కఫా, వాత దోషాలని ఒకేసారి ప్రభావితం చేస్తుంది.



ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది.



వర్షాకాలంలో రోజూ పెరుగు తినడం వల్ల శరీరంలో శ్లేష్మం అభివృద్ధి చెందుతుంది. ఇది జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలకు దారి తీస్తుంది.



ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో పెరుగు వంటి చల్లని శక్తి కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది.



వర్షాకాలంలో పెరుగు తినాలనుకుంటే ఈ పద్ధతి పాటించారంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు.



చిటికెడు వేయించిన జీలకర్ర పొడి, నల్ల మిరియాలు, నల్ల ఉప్పు లేదా తేనె జోడించుకుని తింటే మంచిది.



మెరుగైన జీర్ణక్రియ, గట్ ఆరోగ్యాన్ని కాపాడేందుకు పెరుగు చక్కగా పని చేస్తుంది.
Image Credit: Pixabay/ Pexels