చిగుళ్ల సమస్యతో ముందస్తు ప్రసవం



గర్భం ధరించాక తినే ఆహారం పైనే కాదు, శరీరంలోని అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది.



ఎంతో మందికి తెలియని విషయం ఏంటంటే చిగుళ్ళ నొప్పి, వ్యాధులు వంటివి గర్భిణులకు వస్తే చాలా ప్రమాదం.



అవి నెలలు నిండకుండానే ముందే ప్రసవం అయ్యేలా చేస్తాయి. అందుకే గర్భిణులు చిగుళ్ల వ్యాధులను తేలిగ్గా తీసుకోకూడదు.



చిగుళ్ళ వాపును జింజివైటిస్ అంటారు. ఇది వస్తే దంతాలపై గార పేరుకు పోతుంది. చిగుళ్ళు వాపు వస్తుంది. నొప్పి కూడా పెడతాయి.



చిగుళ్ల వాపుకు కారణమైన బ్యాక్టీరియా నోట్లోంచి రక్తానికి, రక్తం నుంచి మాయకు చేరుకునే ప్రమాదం ఎక్కువ. మాయ ద్వారా బిడ్డకు చేరుకునే అవకాశం ఉంది.



దీనివల్ల నెలలు నిండకముందే నొప్పులు రావచ్చు. ఎనిమిదో నెలలో కూడా కాన్పయ్యే అవకాశం ఎక్కువ.



కాబట్టి గర్భధారణ సమయంలో నోటి పరిశుభ్రతకు సమయాన్ని కేటాయించాలి.



ఎంతోమంది గర్భిణులకు ఇలా చిగుళ్ల జబ్బు, చిగుళ్ల వాపు వంటివి ప్రమాదకరమైనవని తెలియదు.