వానాకాలంలో కీళ్లనొప్పులు ఎక్కువెందుకు?



ఆర్థరైటిస్ ఉన్నవారికి చల్లని వాతావరణం పడకపోవచ్చు. ముఖ్యంగా వానాకాలంలో వీరికి కీళ్లనొప్పులు ఎక్కువైపోతుంటాయి.



దీనికి కారణం ఏమిటని తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.



వాతావరణంలో వచ్చే మార్పులే ఇలా కీళ్ల నొప్పులకు కారణమని చెప్పేవారు ఉన్నారు.



వర్షం పడడానికి ముందు వాతావరణంలో గాలి పీడనం తగ్గిపోతుంది. శరీరం మీద గాలి పీడనం తక్కువగానే ఉంటుంది.



దీనివల్లే కండరాలు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాలు వ్యాకోచిస్తాయి. దీంతో కీళ్ళ మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.



దీనివల్ల కీళ్ల నొప్పులు వస్తాయని అనుకుంటున్నారు ఆరోగ్య నిపుణులు.



వానలు తగ్గాక వాతావరణంలో గాలిపీడనం మళ్లీ పెరుగుతుంది. అప్పుడు నొప్పులు తగ్గిపోతాయి.



ఒకచోటే ఎక్కువసేపు కూర్చుంటే కండరాలు, కీళ్లు బిగుసుకుపోయి ఇలా నొప్పి పెరగవచ్చు.