నెల రోజులు మాంసాహారం మానేస్తే జరిగేది ఇదే



అమెరికా, యూరోప్ దేశాల్లో మాంసాహారాన్ని వదిలి శాఖాహారం వైపుగా మారుతున్న వారు ఎంతోమంది ఉన్నారు.



మొక్కల ఆధారిత ఆహారాలు సాధారణంగా గుండె జబ్బులు, అధిక రక్తపోటు, టైప్2 డయాబెటిస్, క్యాన్సర్ వంటి సమస్యలతో చాలా తక్కువ సంబంధాన్ని కలిగి ఉంటాయి.



మాంసాహారాన్ని అధికంగా తినేవారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ.



మాంసాహారాన్ని ఒక నెల రోజులు దూరం పెడితే శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి.



మానసిక ఆరోగ్యంలో కూడా మార్పులు వస్తాయి. మీరు కోపం తక్కువగా తెచ్చుకుంటారు ప్రశాంతంగా ఉంటారు.



శాఖాహారం శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. సెల్యులర్ డ్యామేజ్ కాకుండా రక్షిస్తుంది.



దీనివల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు కూడా ఆరోగ్యంగా ఉండి ప్రశాంతమైన మనసుని ఇస్తుంది.



మాంసం తినడం మానేస్తే శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ తగ్గుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కాపాడుతుంది.