వివాహం ఆనందంగా సాగాలంటే ఈ పనులు చేయండి



ఆనందకరమైన, సంతృప్తితో నిండిన వివాహాన్ని నిర్మించడానికి భార్యాభర్తలు ఇద్దరూ ముందడుగు వేయాలి.



ఉదయం లేచిన వెంటనే కొన్ని రకాల అలవాట్లు చేసుకోవడం ద్వారా మీ వివాహాన్ని సానుకూలంగా, ఆనందంగా మార్చుకోవచ్చు.



ఉదయం లేచిన వెంటనే మీ జీవిత భాగస్వామికి నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్పండి.



ఒకరికొకరు ఇలా గుడ్ మార్నింగ్ చెప్పుకోవడం వల్ల మీరు నిద్ర లేవగానే మీ మనసులో ఉన్న మొదటి వ్యక్తి మీ భాగస్వామి అని వారు అర్థం చేసుకుంటారు.



టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటే ఇద్దరూ కలిసి తాగండి. లేదా బ్రేక్ ఫాస్ట్ ఇద్దరూ కలిసే చేయండి.



ఉదయం లేచాక వ్యాయామం లేదా ధ్యానం వంటివి ఇద్దరూ కలిసి చేయండి.



ఉదయం లేచిన వెంటనే కౌగిలించుకోవడం లేదా చిన్న ముద్దు పెట్టుకోవడం, చేతులు పట్టుకోవడం వంటివి జీవిత భాగస్వామికి చాలా ధైర్యాన్ని నింపుతాయి.



ఉదయం ఎంత బిజీగా ఆఫీస్ కి పరుగులు పెడుతున్నా ఆమె కోసం మాత్రం ఒక ఐదు నిమిషాలు అయినా కేటాయించండి.