దగ్గు మందులో ప్రమాదకరమైన రసాయనం?



మన దేశంలో తయారైన దగ్గు, జలుబు సిరప్ లపై అనేక వాదనలు జరుగుతూనే ఉన్నాయి.



డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా చెప్పిన ఫాల్కోడిన్ అనే రసాయనం ఉన్న దగ్గు సిరప్‌ను వినియోగించకూడదు.



మెదడులో ఉన్న ఒక ప్రాంతంలోని కణ చర్యను అణిచివేయడం ద్వారా పొడి దగ్గును తగ్గిస్తుంది ఫాల్కోడిన్.



దగ్గుకు చికిత్స చేయడానికి ప్రపంచవ్యాప్తంగా విక్రయించే టాబ్లెట్లు, సిరప్‌లలో సాధారణంగా ఉండే పదార్థమే ఇది.



దీనిని అతిగా వాడితే చాలా ప్రమాదకరం. ఆరేళ్ల లోపు పిల్లలకు పూర్తిగా ఫాల్కోడిన్ ఉన్న దగ్గు సిరప్‌ను వేయకూడదు.



వైద్యుల వద్దకు వెళుతున్నప్పుడు ఆరేళ్లలోపు పిల్లలకు ఫాల్కోడిన్ ఉన్న దగ్గు సిరప్‌లు వద్దని చెప్పండి.



ఫాల్కోడిన్ వాడడం వల్ల తీవ్రమైన ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది.



మలబద్ధకం, మగతగా ఉండడం, జీర్ణాశయంతర సమస్యలు, వికారం, వాంతులు, శ్వాసకోశ సమస్యలను కూడా పెంచుతుంది.