కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే డయాబెటిస్?



డయాబెటిస్ అనేది ఒక దీర్ఘకాలిక జీవక్రియ రుగ్మత ఇది. ఒకసారి వచ్చిందంటే జీవితాంతం వెంటాడుతుంది.



మధుమేహం వచ్చినప్పుడు కాళ్లలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి.



డయాబెటిస్ వల్ల నరాలు దెబ్బతినే అవకాశం ఎక్కువ. దీనివల్ల కాళ్లలో నరాల వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది.



కాళ్ళు తిమ్మిరి పట్టడం, మంటలు పుట్టడం, జలదరింపులు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.



వారి పాదాలపై గాయాలు లేదా పుండ్లు వచ్చినా కూడా త్వరగా తగ్గవు. అంటు వ్యాధులు కూడా త్వరగా సోకుతాయి.



కాలు తిమ్మిర్లు పట్టడం, నొప్పి పుట్టడం, బలహీనంగా మారడం వంటివి జరుగుతాయి.



రక్తప్రసరణ కాళ్ళకి, పాదాలకి సరిగా జరగకపోవడం వల్ల పుండ్లు పడే అవకాశం ఉంది.



కిత్స చేయకుండా అలా వదిలేస్తే గ్యాంగ్రీన్ వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి. దీని వల్ల కాలు లేదా పాదాన్ని తొలగించాల్సి రావచ్చు.