మెదడు తినే అమీబాలతో జాగ్రత్త



మెదడు తినే అమీబాలను నేగ్లేరియా ఫౌలేరి అంటారు.



ఇది సాధారణంగా కలుషితమైన చెరువులు, మంచినీటి సరస్సులు, నదులు, కలుషితమైన స్విమ్మింగ్ పూల్ వంటి వాటిలో ఉంటాయి.



ఈ అమీబాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. కేవలం మైక్రోస్కోప్‌తో మాత్రమే ఇవి కనిపిస్తాయి.



అమీబాలాంటి సూక్ష్మ క్రిములు నీటితో పాటూ ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి.



ఈ అమీబాలు ముక్కు నుంచి మెదడుకు చేరుతాయి. అక్కడ మెదడు కణజాలాన్ని నాశనం చేస్తాయి.



కలుషితమైన లేదా శుద్ధి చేయని స్విమ్మింగ్ పూల్స్ ఉంటే వాటిలో దిగకండి.



ఇలాంటి అమీబాలు మెదడులో చేరి అరుదైన ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి.



మనదేశంలో కూడా ఈ మెదడు తినే అమీబా కారణంగా ఒక టీనేజర్ మరణించాడు.