ఎర్రకందిపప్పును ఎందుకు తినాలో తెలుసుకోండి



ఎర్ర కందిపప్పును మసూర్ దాల్ అంటారు. ఈ పప్పును కచ్చితంగా అప్పుడప్పుడు తినాలి.



ఈ పప్పుతో సూప్, కిచిడీ, దోశెలు వండుకోవచ్చు. ఇవి చాలా రుచిగా ఉంటాయి.



ఈ పప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది. కొవ్వు తక్కువగా ఉంటుంది. అలాగే ఎన్నో ఖనిజాలు, విటమిన్లు ఉన్నాయి.



అధిక రక్తపోటును తగ్గించే శక్తి ఈ పప్పుకు ఉంది. దీని వల్ల గుండె జబ్బు రాకుండా ఉంటుంది.



గర్భిణీలు కచ్చితంగా తినాల్సిన పప్పుల్లో ఈ ఎర్ర కందిపప్పు కూడా ఒకటి. వీటిలో ఉండే ఫోలేట్ బిడ్డ ఎదుగుదలకు అవసరం.



పిల్లలు, మహిళలు కచ్చితంగా ఈ పప్పును తినాలి. ఎముకలు బలంగా మారుతాయి.



నోటి పరిశుభ్రతలకు ఈ పప్పు ఎంతో మేలు చేస్తుంది.



దీనిలో కొవ్వు తక్కువగా ఉంటుంది కాబట్టి బరువు త్వరగా తగ్గుతారు.