డిజిటల్ డిటాక్స్ అంటే ఒక వ్యక్తి టెలివిజన్, కంప్యూటర్లు, ట్యాబ్, స్మార్ట్ ఫోన్ వంటి సాంకేతిక పరికరాలు ఉపయోగించకుండా ఉండే సమయం.



ఈ టైమ్ లో అసలు సోషల్ మీడియా జోలికి వెళ్లకూడదు. సింపుల్ గా చెప్పాలంటే ఫోన్ నుంచి తీసుకునే విరామం.



మానసిక క్షేమం నుంచి మెరుగైన సంబంధాలు వరకు డిజిటల్ డిటాక్స్ ప్రతి ఒక్కరికీ ప్రయోజనకరంగా ఉంటుంది.



స్మార్ట్ ఫోన్, డిజిటల్ పరికరాయలు, సోషల్ మీడియా నుంచి విరామం తీసుకోవడం వల్ల
ఒత్తిడి స్థాయిల్ని తగ్గించడంలో సహాయపడుతుంది.


డిజిటల్ డిటాక్స్ కి వెళ్ళినప్పుడు మీకు చాలా సమయం ఉంటుంది.



కుటుంబంతో సమయం గడిపేందుకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది.



డిజిటల్ డిటాక్స్ వల్ల నిద్రకి ఎటువంటి అంతరాయం ఏర్పడదు. హాయిగా ప్రశాంతంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా నిద్రపోవచ్చు.



డిజిటల్ డిటాక్స్ ఫాలో అయితే శరీరంలోని వివిధ భాగాలని ఉపశమనం కలిగిస్తుంది.



మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ నయా ట్రెండ్ ఫాలో అయిపోయి ప్రశాంతమైన జీవితం గడిపేయండి.