తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళకి బాలీవుడ్ లో రాణిస్తోంది. నాజూకు శరీరంతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.



తెలుగులో అవకాశాలు కంటే బాలీవుడ్ లోనే వరుస పెట్టి సినిమాలు చేస్తూ హిట్స్ సొంతం చేసుకుంటుంది.



ఒకప్పుడు కాస్త బొద్దుగా ఉండే శోభిత ఇప్పుడు జీరో సైజ్ మెయింటెన్ చేస్తూ వావ్ అనిపిస్తుంది.



బరువు తగ్గేందుకు తను ఫాలో అయిన డైట్ మీరు ఫాలో అయ్యారంటే తనలా అందంగా కనిపిస్తారు.



బ్రేక్ ఫాస్ట్ గా తృణధాన్యాలు, ఫైబర్ అధికంగా ఉండే ఓట్ మీల్, గ్రీక్ పెరుగు, కాస్త తేనె తీసుకుంటుంది.



హైడ్రేట్ గా ఉండేందుకు పుష్కలంగా నీరు తాగుతుంది. రోజుకి ఎనిమిది గ్లాసుల నీటిని లక్ష్యంగా పెట్టుకుంది.



మధ్యాహ్న భోజనంగా క్వినోవా, బ్రౌన్ రైస్, కూరగాయలు, చిక్ పీస్, కాయధాన్యాలతో కూడిన సలాడ్ ఎంచుకుంటుంది.



ఈవినింగ్ స్నాక్స్ గా చిరుతిండికి బదులుగా తాజా పండ్లతో చేసిన స్నాక్స్ ఇష్టపడుతుంది.



రాత్రి భోజనం లైట్ గా ఉండేలా చూసుకుంటుంది. కాల్చిన కూరగాయలు, సూప్ ప్రిఫర్ చేస్తుంది.



బరువు తగ్గే డైట్ ఫాలో అవుతూ తను నోరు కట్టేసుకోలేదు. అప్పుడప్పుడు తనకి ఇష్టమైన చీజ్ ఐటెమ్స్ కూడా లాగించేసింది.



ఇలా తనకి నచ్చినవి తింటూనే ఆరోగ్యంగా, ఫిట్ నెస్ మెయింటెన్ చేయగలుగుతుంది.
Image Credit: Pexels/ Sobhita Dhulipala Instagram