స్వచ్ఛమైన శాకాహారులు అంటే?



ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణి సుధా మూర్తి. ఈమె స్వచ్ఛమైన శాఖాహారి. ఈ విషయాన్ని తానే వెల్లడించింది.



అప్పటినుంచి స్వచ్ఛమైన శాఖాహారులు అంటే ఏమిటివ అనే దానిపై చర్చ జరుగుతోంది.



స్వచ్ఛమైన శాఖాహారులు అంటే ఎలాంటి మాంసాహారాన్ని ముట్టుకోనివారు. గుడ్లు కూడా తినరు. పాల ఉత్పత్తులను కూడా దూరం పెడతారు.



కొన్ని అధ్యయనాల ప్రకారం శాఖాహారం... గుండె వ్యాధుల నుంచి కాపాడుతుంది.



స్వచ్ఛమైన శాఖాహారంలో కొవ్వు నిండిన ఆహార పదార్థాలు ఏవీ ఉండవు. కాబట్టి గుండె వంటి ప్రధాన అవయవాలు వ్యాధుల బారిన పడకుండా ఉంటాయి.



మాంసాహారులతో పోలిస్తే స్వచ్ఛమైన శాఖాహారులు త్వరగా బరువు పెరగరు.



స్వచ్ఛమైన శాకాహారుల్లో త్వరగా పోషకాహార లోపం వచ్చే అవకాశం ఉంది.



విటమిన్ బి12, విటమిన్ డి, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, క్యాల్షియం, ఐరన్, జింక్ వంటివి లోపించే అవకాశం ఎక్కువ. కాబట్టి ఈ లోపాలు తీర్చడానికి సప్లిమెంట్లను వాడాలి.