ఈ దేశాల్లో అమ్మలు అదృష్టవంతులు



సిక్కిం ప్రభుత్వం..ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మహిళలందరికీ ప్రసూతి సెలవులను ఏడాది పాటు పొడిగించినట్లు ప్రకటించారు.



కొన్ని దేశాల్లో సిక్కిం రాష్ట్రం ఇచ్చినట్టుగానే అమ్మలకు అధికంగా సెలవులు అందిస్తున్నారు.



లిథువేనియా దేశంలో తల్లికి 18 నెలల పాటూ ప్రసూతి సెలవులు ఇస్తారు. తండ్రికి నాలుగు వారాలు ఇస్తారు.



జర్మనీలో మూడేళ్ల పాటూ ప్రసూతి సెలవులు అందిస్తారు.



స్వీడన్లో బిడ్డ పుట్టాక తల్లిదండ్రులిద్దరూ 480 రోజుల పాటూ ప్రసూతి సెలవులు తీసుకోవచ్చు.



స్పెయిన్లో కేవలం 16 వారాల పాటే సెలవులు ఇస్తారు. తండ్రులకు అయిదు వారాల వరకు ఉంటుంది.



ఇక హంగెరీ దేశంలో 24 వారాల ప్రసూతి సెలవులు లభిస్తాయి.



మన దేశంలో గత అయిదేళ్లుగా తల్లికి ఆరు నెలల మెటర్నిటీ లీవ్స్ ని అందిస్తున్నారు.