వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్లను రోల్అవుట్ చేయనుంది. ప్రస్తుతానికి ఇవి బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలో సాధారణ యూజర్లకు కూడా అందుబాటులోకి రానున్నాయి. వాట్సాప్ గ్రూప్ వీడియో కాల్‌ను 32 మందితో స్టార్ట్ చేసే ఫీచర్ రానుంది. గతంలో కేవలం 15 మందితో మాత్రమే ప్రారంభించే ఆప్షన్ ఉండేది. దీంతో పాటు కాల్స్ ట్యాబ్‌కు కూడా మరిన్ని మార్పులు చేయనుంది. కాల్ లింక్ ఆప్షన్ ఇక స్క్రీన్‌పై కనిపించబోదు. ఫ్లోటింగ్ యాక్షన్ బటన్‌ను కూడా అప్‌డేట్ చేయనున్నారు. ఇందులో ప్లస్ బటన్ కూడా ఉండనుంది. వీటితో పాటు మరిన్ని కొత్త ఫీచర్లపై కూడా వాట్సాప్ పని చేస్తుంది.