ఐఫోన్ 15 ప్రో సిరీస్‌ను యాపిల్ గ్లోబల్‌గా లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఏ17 బయోనిక్ ప్రాసెసర్లపై ఈ రెండు ఫోన్లు పని చేయనున్నాయి. యాపిల్ వాచ్ అల్ట్రాలో అందించిన ప్రోగ్రామబుల్ యాక్షన్ బటన్‌ను ఈ సిరీస్‌లో అందించారు. ఛార్జింగ్ కోసం లైట్‌నింగ్ పోర్టు కాకుండా యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ఉండనుంది. ఐఫోన్ 15 ప్రో ధర మనదేశంలో రూ.1,34,900 నుంచి ప్రారంభం కానుంది. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర మనదేశంలో రూ.1,59,900 నుంచి ప్రారంభం కానుంది. టాప్ ఎండ్ అయిన 1 టీబీ వేరియంట్ ధరను రూ.1,99,900గా నిర్ణయించారు. వీటికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 15వ తేదీ నుంచి, సేల్ సెప్లెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. బ్లాక్ టైటానియం, బ్లూ టైటానియం, నేచురల్ టైటానియం, వైట్ టైటానియం కలర్ మోడల్స్‌లో ఈ ఫోన్లు కొనుగోలు చేయవచ్చు.