వాట్సాప్ త్వరలో ఛాట్లు వైర్‌లెస్‌గా ట్రాన్స్‌ఫర్‌గా చేసుకునే ఫీచర్ తీసుకురానుంది.

ఈ ఫీచర్ ప్రస్తుతానికి ఆండ్రాయిడ్‌లో మాత్రమే అందుబాటులో రానుంది.

మీరు ఒక ఫోన్‌లో నుంచి మరో ఫోన్‌లో వాట్సాప్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు గూగుల్ డ్రైవ్ బ్యాకప్ అవసరం లేదు.

దీని కోసం పాత ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేయాలి.

తర్వాత మీకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది.

ఆ కోడ్‌ను కొత్త ఫోన్‌లో స్కాన్ చేస్తే సరిపోతుంది.

దీని కోసం మీ ఫోన్‌లో వైఫై ఆన్‌లో ఉంటే చాలు.



క్లౌడ్ బ్యాకప్ కంటే ఇది వేగవంతమైన ఆప్షన్.



అయితే ప్రస్తుతానికి దీని ద్వారా ఆండ్రాయిడ్ నుంచి ఆండ్రాయిడ్‌కు మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేయగలం.

ఐవోఎస్‌కు ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు.