నోరు ఆరోగ్యానికి వాకిలి. నోటి ద్వారా ప్రభావితమయ్యే ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుందాం.

దంతక్షయం గుండెజబ్బులు, మానసిక సమస్యలు, అల్సర్లు, కిడ్నీఫెయిల్యూర్ వంటివాటితో సంబంధం కలిగి ఉంటుంది.

జింజివైటిస్ బ్యాక్టీరియా సంక్రమణ వల్ల వస్తుంది. చికిత్స లేకుండా వదిలేస్తే పీరియాంటైటిస్ గా మారుతుంది. దవడ ఎముకకు నష్టం చేస్తుంది.

టెంపోరోమాండిబ్యులర్ జాయింట్ డిజార్డర్ వల్ల దవడనొప్పి, దవడకలదలికల్లో ఇబ్బంది ఏర్పడుతుంది.

బ్రక్సిజం అనేది నిద్రకు సంబంధించిన సమస్య. ఇది స్లీప్ ఆప్నియా తో సంబంధం ఉంటుంది.

ఒడోంటోమాస్ అనే సమస్యలో దంత కణజాలంతో కూడిన కణితులు ఏర్పడుతాయి.

పుట్టుకతో ఏర్పడే క్లెఫ్ట్ లిఫ్ట్ సమస్య కూడా జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తంది.

క్రానిక్ హాలిటోసిస్ అనేది దీర్ఘకాలిక నోటి దుర్వాసన. టాన్సిలైటిస్, మధుమేహం, సైనసైటిస్ వల్ల రావచ్చు.

చాలా అరుదుగా లంగ్ క్యాన్సర్, సిస్టిక్ ఫైబ్రోసిస్ వల్ల కూడా క్రానిక్ హాలిటోసిస్ రావచ్చు.

Representational Image : Pexels