అలర్జీలు బాధిస్తుంటే కీటికీలు, తలుపులు మూసి పెట్టుకోవడం మంచిది. అలర్జీ కారకాలను ఇంట్లోకి రాకుండా నిరోధిస్తుంది.

హై ఎఫీషియెన్సీ పార్టికల్ ఎయిర్ ఫల్టర్ (HEPA) ను ఇంట్లో అమర్చుకుంటే అలర్జీ కారకాలను తొలగిస్తుంది.

ఏసిలు HEPA అమరికలతో అందుబాటులో ఉన్నాయి. వీటిని వాడడం మంచిది.

బయటి నుంచి వచ్చిన వెంటనే ఇంటి బయటే చెప్పులు వదిలెయ్యడం, బట్టలు మార్చుకోవడం ద్వారా అలెర్జీ కారకాలను నిరోధించవచ్చు.

ముఖ్యంగా క్లీనింగ్, గార్డెనింగ్ సందర్భాల్లో మాస్క్ ధరించడం అలవాటు చేసుకుంటే మంచిది.

తగినన్ని పండ్లు కూరగాయలు ఆహారంలో భాగం తీసుకుంటే అలర్జీలు దరిచేరవు.

పోషకాహారం తీసుకోవడం, హైడ్రేటెడ్ ఉండడం, క్రమం తప్పని వ్యాయామం చాలా ముఖ్యం.

వీలైనంత వరకు సహజమైన క్లీనర్లను ఉపయోగించాలి.

తరచుగా ఆవిరి పడుతుండాలి.

పాసివ్ లేదా, యాక్టివ్ స్మోకింగ్ కి పూర్తిగా దూరంగా ఉండాలి.
Representational Image : Pexels