చక్కెర తినడం మానేస్తే... చక్కెరను పూర్తిగా మానేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఓసారి నెల రోజులు పాటూ మానేసి చూడండి. ఎన్ని మార్పులు జరుగుతాయో. చక్కెర తినక పోవడం వల్ల రక్తంలో చక్కెర స్థిరంగా ఉంటుంది. హెచ్చుతగ్గులు ఉండవు. చక్కెర మానేయడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. పంచదార తినకపోవడం వల్ల దంతక్షయం తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కాలేయం ఆరోగ్యం మెరుగుపడుతుంది. చక్కెర వల్ల కాలేయానికి సమస్యలు వస్తాయి. పంచదార మానేస్తే శక్తి స్థిరంగా అందుతుంది. చక్కెర వల్ల ఆరోగ్యానికి అన్ని రకాలుగా నష్టమే కలుగుతుంది. చక్కెర ఎంత తగ్గిస్తే అంత మంచిది. భవిష్యత్తులో డయాబెటిస్ వచ్చే అవకాశం తగ్గుతుంది.