ఉదయాన్నే బెర్రీలు తింటే వీటి లోగ్లైసిమిక్ ఇండెక్స్, పైబర్ వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.

ఆరోగ్యవంతమైన కొవ్వులు, ప్రొటీన్ తోపాటు ఫైబర్ కలిగిన బాదాం తింటే తక్షణం శక్తి లభిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో .

ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్స్, ఫైబర్ కలిగిన షియా సీడ్స్ తో ఇన్ఫ్లమేషన్ ఉండదు. బరువు కూడా తగ్గవచ్చు.

ఫైబర్, లిగ్నాన్ ఉండే అవిసెగింజలు జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కడుపు నిండుగా ఉండి ఆకలి అదుపులో ఉంటుంది.

మెంతిగింజలను రాత్రి నానబెట్టి ఉదయాన్నే వాటిని చప్పరించి మింగేస్తే బ్లడ్ షుగర్, ఆకలి అదుపులో ఉంటాయి.

గ్రీక్ యోగర్ట్ లో నాణ్యమైన ప్రొటీన్ ఉంటుంది. ఇది కండరాల పుష్టికి మంచిది. బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది.

గ్రీన్ టీలో ఉండే కెఫిన్ శరీరంలో శక్తిని పెంచుతుంది. వర్కవుట్ కి ముందు తీసుకోవడం మంచిది. ఎక్కువ క్యాలరీలు ఖర్చు చెయ్యగలుగుతారు.

ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మ చెక్క పిండుకుని తాగితే విటమిన్ సి శరీరానికి అందుతుంది. రోజంతా శక్తిమంతంగా ఉండొచ్చు.

జీర్ణక్రియను నెమ్మదింపజేసి బరువు తగ్గేందుకు దోహదం చేసే ఓట్స్ ఉదయాన్నే తీసుకోవడం మంచిది.

హైడ్రేటెడ్ గా ఉంచి, కడుపు నిండుగా ఉండే భావన కలిగించే వాటర్ మిలన్ ఉదయాన్నే తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.

Images courtesy : Pexels