చలికాలంలో వెచ్చగా ఉండే పానీయాల మీద మనసు పోతుంటుంది. ఇలాంటి పానీయాల్లో హాట్ చాక్లెట్ మెరుగైందట.

రుచిగా ఉండే ఈ పానీయంతో కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

చాక్లెట్‌తో మైండ్ రిలాక్స్ అవుతుంది. ఒత్తిడితో బాధపడేవారికి ఇది మంచి ఔషదం.

అయితే ఇది సహజమైన కోకో పొడి లేదా డార్క్ చాక్లెట్ తో తయారు చేసిన పానియంతో మేలు జరుగుతుంది.

కోకొపొడిలో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లెవనాయిడ్లు పుష్కలం. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది.

హాట్ చాక్లెట్ మూడ్ బూస్టర్ గా పనిచేస్తుంది. మూడ్ బాగు పరిచే ఫినైలేథైలమైన్, ట్రిప్టోఫాన్ వంటివి తక్కువ మొత్తంలో ఉంటాయి.

ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజలవణాలు కోకోపొడి ద్వారా అందుతాయి.

హాట్ చాక్లెట్ శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. హైడ్రేటెడ్ గా ఉండడం ఆరోగ్యానికి చాలా అవసరం.

ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ సమాచారం చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు.

Images courtesy : Pexels