మనిషి తోడేలుగా మారడం సినిమాల్లో చూస్తూనే ఉంటారు. కానీ నిజంగా కూడా తోడేలు మాదిరిగా శరీరమంతా వెంట్రుకలు వచ్చే వ్యాధి ఉంది.

Werewolf సిండ్రోమ్ దీన్నే హైపర్‌ట్రికోసిస్ అని కూడా అంటారు.

అరుదైన ఈ వ్యాధి వల్ల శరీరం అంతటా వెంట్రుకలు వచ్చేస్తాయి. ఇది ఆడ లేదా మగవారిలో ఎవరికైనా రావొచ్చు.

ఈ వ్యాధి వల్ల మొహం, చేతులు, కాళ్ళ మీద వెంట్రుకలు బాగా పెరిగిపోతాయి.

హైపర్ ట్రికోసిస్ అనేక రకాలు ఉన్నాయి. ఇది పుట్టుకతో లేదా పెరిగిన తర్వాత కూడా రావొచ్చు.

అందులోని ఒక రకం హిర్సుటిజం. ఇది కూడా పుట్టుకతో వస్తుంది, స్త్రీ లేదా పిల్లల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.

హైపర్ట్రోకోయిస్ అనేది పుట్టిన తర్వాత కనిపిస్తుంది. ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్ దుష్ప్రభావాలు, పోషకాహార లోపం వల్ల వస్తుంది.

హైపర్‌ట్రికోసిస్ పిండంగా ఉన్నప్పుడు జుట్టు పెరిగే జన్యువులు ఆగిపోయి పుట్టిన తర్వాత మళ్ళీ అవి యాక్టివేట్ అవుతాయి.

Image Source: pexels

పుట్టిన శిశువు పెరుగుతూ ఉంటే శరీరం మీద వెంట్రుకలు కూడా పెరుగుతూనే ఉంటాయి. దీన్నే తోడేలు సిండ్రోమ్ అంటారు.