ప్రధాని మోడీ పర్యటనతో లక్షద్వీప్ పేరు మార్మోగిపోతోంది.

అంతా అక్కడికి ఎలా వెళ్లాలి? పర్యటక ప్రాంతాలేమిటీ అని ఆరా తీస్తున్నారు.

లక్షద్వీప్ కూడా ఇండియాలో భాగమే కదా.. అక్కడ మాట్లాడే భాష ఏమిటని అడుగుతున్నారు.

వాస్తవానికి లక్షద్వీప్ అంటే 38 ద్వీపాల సమాహారం.

కానీ, అక్కడ ఎక్కువగా మాట్లాడేది మలయాళం, ఇంగ్లీష్.

కొన్ని దీవుల్లో హిందీ, తమిళం, సింహాళి (మహీ లేదా మహ్ల్) భాషల్లోనూ మాట్లాడతారు.

అయితే, అక్కడి నివసించే అన్ని తెగల ప్రజలు కామన్‌గా ఇంగ్లీష్‌లో మాట్లాడతారు.

పర్యటకులను కూడా ఇంగ్లీష్‌లోనే పలకరిస్తారు.

కాబట్టి, భాషపరంగా అక్కడ మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

మాల్దీవులు కంటే తక్కువ బడ్జెట్‌లోనే ఇక్కడికి చేరుకోవచ్చు. కాబట్టి.. హ్యపీ జర్నీ.

All Representational Images Credit: Pexels