చేపలు మెదడుకు మంచివా? రోజూ తినొచ్చా?

చేపల్లో బోలెడు పోషకాలుంటాయి.

మెదడు ఆరోగ్యానికి చేపలు బెస్ట్ ఫుడ్ అంటున్నారు నిపుణులు.

చేపల్లోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మెదడు అభివృద్ధికి తోడ్పడుతాయి.

దెబ్బతిన్న నాడీవ్యవస్థను ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సరి చేస్తాయి.

చేపలు తింటే మానసిక ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం ఉందంటున్నారు.

తరచుగా చేపలు తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగు పడుతుంది.

చేపలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల అల్జీమర్స్ వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు.

చేపలతో ప్రమాదకరమైన సెరెబ్రోవాస్కులర్ వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు.

చేపలు ఆరోగ్యానికి మంచివి కదా అని డైలీ తింటే మాత్రం సమస్యే. వారంలో రెండు రోజులు తింటే చాలు. All Photos Credit: Pixabay.com