నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉండేందుకు చాలా మంది మౌత్ ప్రెష్నర్స్ వాడతారు.

అయితే చాలా సులువుగా ఇంట్లో దొరికే మౌత్ ఫ్రెష్నర్ల గురించి తెలుసుకుందాం.

లవంగాల్లో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. లవంగం నోట్లో పెట్టుకుని చప్పరిస్తే చాలు నోరు తాజాగా, శ్వాస సువాసనతో ఉంటుంది.

దాల్చీని శ్వాసను తాజాగా ఉంచుతుంది. దీని తియ్యని ఘాటైన రుచి కూడా బావుంటుంది. నోటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

యాలికలు కమ్మని రుచితో ఉంటుంది. నోటి ఆరోగ్యానికే కాదు జీర్ణక్రియకు తోడ్పడతాయి.

పుదీన చల్లని తాజా భావన కలిగిస్తుంది. నోటి దుర్వాసనను దూరం చేస్తుంది.

నిమ్మ, బత్తాయి, సంత్రా వంటి సిట్రస్ పండ్లు విటమిన్ సి కలిగి ఉంటాయి. వీటి కట్టామీఠా రుచి నోటిని తాజాగా మారుస్తుంది.

గ్రీన్ టీ.. బ్యాక్టీరియాతో పోరాడి నోటిని తాజాగా ఉంచుతుంది.

పైనాపిల్ లోని సహజమైన ఎంజైముల వల్ల శ్వాస తాజాగా ఉండడమే కాదు నోటి ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.

ఈ సమాచారం చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు అనుమాన నివృత్తికి నిపుణులను సంప్రదించాలి Images courtesy : Pexels