వాకింగ్ వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. మెదడు నుంచి కాళ్లు పాదాల వరకు అన్ని అవయవాలకు వ్యాయామం

మీరు రెట్రోవాకింగ్ గురించి విన్నారా? దీనితో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయట. రోజూ నడిస్తే లైఫే మారిపోతుందట.

రెట్రోవాకింగ్ అంటే వెనక్కి నడవడం. విచిత్రంగా ఉన్నా కూడా దీనితో చాలా ప్రయోజనాలున్నాయి.

వాకింగ్ లేదా జాగింగ్ తో పాటు రివర్స్ వాకింగ్ ను కూడా చెయ్యడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుంది.

మోకాలు, పిరుదులు, చీలమండల కదలికలను రెట్రోవాక్ తో మెరుగుపరుచుకోవచ్చు.

వెనకకు నడవడం వల్ల శరీరం మీద మీరు పెట్టే శక్తి పెరుగుతుంది. శారీరక దృఢత్వం మెరుగవుతుంది.

మెదడు సామర్థ్యం పెరిగి సృజనాత్మకత మెరుగవుతుందట. ఓర్పు, భరించే శక్తి కూడా మెరుగు పడుతుంది.

గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. రెట్రోవాక్ కాలి కండరాల బలాన్ని పెంచుతుంది.

మెదడె గుండె ఆరోగ్యానికి మంచి చేస్తుంది. రివర్స్ వాకింగ్ తో సాధారణం కంటే ఎక్కువ క్యాలరీలు ఖర్చు చెయ్యవచ్చు.

వెనకకు కదలడం వల్ల గుండె పంపింగ్ సామర్థ్యం పెరుగుతుందట. జీవక్రియల వేగం కూడా పెరుగుతుంది.

దీనివల్ల బరువు తగ్గి ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే స్టార్ట్ చేసేయండి.

Images courtesy : Pexels