మున‌గ కాయలు మగాళ్లకే కాదు, స్త్రీలకు మంచివే - ఎలాగంటే..

పురుషులకే కాదు, స్త్రీల ఆరోగ్యానికి మున‌గ ఎంతో మేలు చేస్తుంది.

మున‌గ‌లోని కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ప‌ర‌స్ ఎముకలను బలంగా మార్చుతాయి. 30 ఏళ్లు దాటిని స్త్రీలు వీటిని తినాలి.

డయాబెటిక్ పేషెంట్లు మునగను తీసుకుంటే బ్ల‌డ్ షుగ‌ర్ లెవెల్స్‌ కంట్రోల్ అవుతాయి.

మునగలోని ఫైబర్ జీర్ణ స‌మ‌స్య‌ల‌ను నివారిస్తుంది.

మునగ స్త్రీ, పురుషుల్లో ఆ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు సంతాన వృద్ధికి తోడ్పడుతుంది.

మునగతో చర్మ సౌందర్యం మెరుగవుతుంది. కాబట్టి.. స్త్రీలు తప్పకుండా తీసుకోవాలి.

మునగలోని విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.

మునగలోని ఔషధ గుణాలు ఆస్తమా, ఆర్ద‌రైటిస్‌ ను దూరం చేస్తాయి. మునగలోని ఐరన్.. రక్తహీనత సమస్యల నుంచి రక్షిస్తుంది.

All Photos Credit: Pixabay.com