గర్భం దాల్చిన మొదటి నెల నుంచి కూడా పియర్స్ తినవచ్చు.

పియర్స్ లో ఫోలెట్ ఉంటుంది. ఫోలెట్ పుట్టుకతో వచ్చే లోపాలను నివారిస్తుంది.

గర్భవతుల్లో తలెత్తే మలబద్దకాన్ని నివారిస్తుంది. ఇందులో ఫైబర్ అధికం కనుక జీర్ణసమస్యలు రావు.

పియర్స్ లో విటమిన్ కె, సి తో పాటు బి విటమిన్లు కూడా ఉంటాయి. పొటాషియం వంటి మినరల్స్ కూడా ఉంటాయి.

యాంటీఆక్సిడెంట్ల వల్ల ఫ్రీరాడికల్ నష్టం లేకుండా నివారిస్తాయి.

పీయర్స్ లో నీటి శాతం ఎక్కువ కనుక డీహైడ్రేట్ కాకుండా కాపాడుతాయి.

కాలరీలు తక్కువ కనుక బరువు పెరుగుతామన్న భయం లేకుండా తినవచ్చు.

పియర్స్ లో ఉండే టానిన్ వల్ల శరీరం నుంచి టాక్సిన్లను బయటకు పంపి చర్మఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

వీటిలో మోతాదులో ఉండే తియ్యదనం వల్ల షుగర్ క్రేవింగ్స్ కూడా తగ్గిస్తాయి.

Images courtesy : Pexels