కొవ్వు కరిగించాలంటే అంత ఈజీ కాదు. కానీ, కొన్ని పిండ్లు ఆ పని చేస్తాయట. మీరూ ట్రై చెయ్యండి. బాదం గింజలను మిక్సీలో పొడి చేయండి. బాదం పిండిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్, పైబర్ ఉంటాయి. బాదం పిండిలో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువ. గోధుమ పిండికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. ఎండు కొబ్బరి నుంచి తయారు చేసిన పిండి గ్లుటెన్ ప్రీ, ఫైబర్ ఎక్కువ. కార్బోహైట్రేట్లు తక్కువ. శనగ పిండిలో ప్రొటీన్ కంటెంట్ ఎక్కువ. కనుక ఆకలి తీరి కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. క్వినోవా ప్రొటీన్ కలిగిన పురాతన ధాన్యం. క్వినోవా పిండి గ్లుటేన్ ఫ్రీ. ఇందులో 9 ఆవశ్యక అమైనోఆసిడ్లు ఉంటాయి. ఫైబర్, ప్రొటీన్ కలిగిన బక్వీట్ తో కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. ఓట్స్ ఫ్లోర్ గుండెకు చాలా మంచిది. కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేస్తుంది. సజ్జపిండిలో ఫైబర్, ప్రొటీన్ తో పాటు చాలా పోషకాలు ఉంటాయి. జొన్నపిండిలో ఉండే ఫైబర్ వల్ల కడుపు నిండుగా ఉంటుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. Images courtesy : Pexels