కొత్తసంవత్సరం మొదటి వారంలో ఈ సంవత్సరం చేరాల్సిన లక్ష్యాల ప్రణాళికలు ఉంటాయి. వాటిలో ఫిట్ నెస్ ఒకటి.

మొదట్లో సులభమైన లక్ష్యాలు ఏర్పరుచుకుంటే బావుంటుంది. ఒక్కో మెట్టు ఎక్కుతుంటే ఉత్సాహంగా ఉంటుంది.

ముందుగా నిర్ణీత దూరం వరకు పరుగెత్తాలనో, వాకింగ్ చెయ్యాలనో లాంటి చిన్నచిన్న గోల్స్ పెట్టుకుంటే మంచిది.

లాంగ్ టర్మ్ లక్ష్యాలను చిన్నచిన్న భాగాలుగా విభజించుకోండి. కొద్దికొద్దిగా వర్కవుట్ సమయం పెంచుకుంటూ పోవడం వంటివన్నమాట.

రోజూ ఒకేలాంటి వర్కవుట్ మీకు బోర్ కొట్టించే ప్రమాదం ఉంటుంది. అందుకే రకరకాల వ్యాయామ పద్దతులను అనుసరించవచ్చు.

ఇది బోర్ డమ్ ను దూరం చెయ్యడం మాత్రమే కాదు శరీరానికి కొత్త సవాళ్లు ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఇస్తుంది.

ఫ్రెండ్ లేదా మీ భాగస్వామినో వర్కవుట్ కంపానియన్ గా పెట్టుకుంటే మరింత ఎంజాయ్మెంట్ తో ఈ పని చేస్తారు.

అంకితభావం చాలా ముఖ్యం. మీ వర్కవుట్ టైమ్ ను ఎట్టి పరిస్థితుల్లో హాజరుకావల్సిన పనిగా పెట్టుకోవాలి.

లక్ష్యాలను చేధించినపుడు మీమ్మల్ని మీరు ఉత్సాహపరచుకోవడం చాలా ముఖ్యం.

Images courtesy : Pexels