కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం ప్రసరణ వ్యవస్థ ఆరోగ్యానికి తద్వారా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

బుజ్జి క్యాబేజిల వంటి బ్రసెల్ స్ప్రౌట్స్ లో ఫైబర్ చాలా ఎక్కువ. వీటిలో ఉండే ఫైబర్ బైల్ ఆసిడ్ తో కలిసి చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది.

యాంటీఆక్సిడెంట్లు, ప్లాంట్ స్టెరోల్ తోపాటు ఫైబర్ కూడా కలిగి ఉండే ఆకుకూర కాలే.

పైగా ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఆక్సిడేషన్ ఒత్తిడిని నివారిస్తాయి. ఫలితంగా గుండె ఆరోగ్యం పదిలమవుతుంది.

శరీరంలో ఎల్డీఎల్ వల్ల ఆక్సిడేషన్ స్థాయి పెరుగుతుంది. దీన్ని బీట్ రూట్ నివారిస్తుంది. బీట్ రూట్ లోని కరిగిపోయే ఫైబర్ వల్ల ఇది సాధ్యం.

బీటా కెరోటిన్, ఫైబర్, విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉన్న చిలగడదుంప బైల్ ఆసిడ్ ఉత్పత్తి పెంచి కొలెస్ట్రాల్ ను విచ్ఛిన్నం చేస్తుంది.

రాచగుమ్మడిలో యాంటీఆక్సిడెంట్లు, బీటాకెరోటిన్, విటమిన్ సి పుష్కలం. ఇది కొలెస్ట్రాల్ తగ్గించి, ఆక్సిడేషన్ ఒత్తిడిని తగ్గిస్తుంది.

చలికాలంలో దొరికే మరో అద్భుతమైన కాయగూర క్యాబేజ్. ఇందులోని ఫైటోకెమికల్స్ రక్తనాళాల్లో ప్లేక్ ఏర్పడకుండా నివారిస్తాయి.

బీటాకెరోటిన్, విటమిన్ ఎ కలిగిన క్యారెట్లో ఫైబర్ కూడా ఎక్కువే. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపు చేసేందుకు తోడ్పడుతుంది.



Images courtesy : Pexels