టమాటోను ఎన్నో ఏళ్లుగా చాలా మంది చర్మ సంరక్షణకోసం ఉపయోగిస్తారు. ఇది పూర్తిగా విటమిన్లు, న్యూట్రెంట్స్తో నిండి స్కిన్‌కు మంచి పోషణ ఇస్తుంది. చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, మృతకణాలను దూరం చేస్తుంది. ఆయిల్ స్కిన్‌ను దూరం చేయడంలో టమాటో మంచి ఫలితాలు ఇస్తుంది. పింపుల్స్ మిమ్మల్ని ఇబ్బందిపెడుతుంటే టమాటో వల్ల రిలీఫ్ పొందవచ్చు. సన్‌టాన్ నుంచి విముక్తినివ్వడమే కాకుండా.. సూర్మరశ్మి నుంచి స్కిన్‌ను కాపాడుతుంది. యవ్వనమైన చర్మం కావాలనుకుంటే మీరు టమాటోను అప్లై చేయవచ్చు. చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది. (Images Source : Unsplash)