కోవిడ్ తర్వాత పొంచివున్న మరో ముప్పు నియోకోవ్. ఈ వైరస్ ఎందుకంత ప్రమాదకరం?

కరోనాలో ఎన్నో రకలా వైరస్‌లు ఉంటాయి. అవి జలుబు, దగ్గు, శ్వాస సమస్యలను కలిగిస్తాయి.

కరోనా పరిభాషలో SARS అంటే అత్యంత తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యల సముదాయం.

NeoCov‌ను తొలుత దక్షిణాఫ్రికాలోని గబ్బిలాల్లో గుర్తించినట్లు స్పూత్నిక్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

NeoCov ఇప్పటివరకు జంతువుల నుంచి మనుషులకు వ్యాపించలేదు.

NeoCovలో ఒక్క మ్యూటేషన్ పెరిగినా మనుషులకు వ్యాపిస్తుందని ఉహాన్ శాస్త్రవేత్తలు తెలిపారు.

2012లో సౌదీ అరేబియాలో వ్యాపించిన MERS వైరస్‌తో దీనికి సంబంధం ఉంది.

ఒంటెల ద్వారా వ్యాపించిన MERS వైరస్ వల్ల అప్పట్లో 858 మంది చనిపోయారు.

NeoCov వైరస్ కూడా SARS-CoV-2 మాదిరిగానే మానవ కణాలలోకి చొచ్చుకుపోతుంది.

NeoCov సోకిన ముగ్గురిలో ఒకరు మరణిస్తారని ఉహాన్ శాస్త్రవేత్తలు తెలిపారు.

ప్రస్తుతానికైతే ఈ వైరస్ గురించి ఆందోళన అవసరం లేదు. కానీ, భవిష్యత్తులో దీనితో ముప్పే.

All Images Credit: Pixabay and Pixels