ABP Desam


రథ సప్తమి రోజు ఏం చేస్తే మంచిది.. ఎలాంటి ఫలితం ఉంటుంది..


ABP Desam


భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే. అందుకే భానుడిని ప్రత్యక్షదైవం అంటారు.


ABP Desam


హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యాధనకు ఎంతో విశిష్టత ఉంది. మాఘ మాస శుక్ల పక్షం సప్తమి రోజు జరుపుకునే రథసప్తమి మరింత విశేషమైనదని చెబుతారు.


ABP Desam


సూర్యుడిని ఆరోగ్యప్రాధాతగా కోలుస్తారు. రథసప్తమి రోజున ప్రాతఃకాల సమయంలో గంగలో స్నానాలు, సూర్యోపాసనల వలన మృత్యుభయం పోతుందని విశ్వాసం.


ABP Desam


తలమీద 7 జిల్లేడు ఆకులను, రేగు పళ్ళను ఉంచుకుని స్నానం చేయాలి. జిల్లేడు ఆకుని అర్కపత్రం అంటారు. సూర్యునికి అర్కః అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం , ఏడు జన్మల్లో చేసిన పాపాలు, ఏడు రకాలైన వ్యాధులు నశింపజేస్తాయంటారు.


ABP Desam


రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసికోట పక్కగా ఆవు పేడతో అలికి, దానిపై పిండితో పద్మం వేసి, పొయ్యి పెట్టి, సంకాంత్రి రోజున పెట్టిన పిడకలు, గొబ్బెమ్మలతో పొయ్యి వెలిగించి దాని మీద పాలు పొంగిస్తారు.


ABP Desam


పొంగిన పాలల్లో కొత్తబియ్యం, బెల్లం, నెయ్యి, ఏలకులు వేసి పరమాన్నం తయారు చేస్తారు. తులసికోట ఎదురుగా చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడాకులపై పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు.


ABP Desam


రథసప్తమి రోజు సూర్యుడిని ఎరుపు రంగు పూలతో పూజిస్తే మంచిది. బంగారం, వెండి లేదా రాగితో సూర్యుడికి చిన్న రథం చేయించి అందులో ఎర్రరంగు సూర్యుని విగ్రహాన్ని ప్రతిష్టించి పూజించి ఆ రథాన్ని పండితులకు దానం ఇస్తే మంచిదంటారు.


ABP Desam


రథ సప్తమి రోజు ఉపవాసం ఉండి దైవారాథనలోనే కాలం గడిపితే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుని అనుగ్రహం పొందుతారని విశ్వాసం.



ఈ రోజున ముత్తయిదువులు తమ నోములకు, వ్రతాలకు అంకురార్పణ చేస్తారు.



ఈ రోజు ఏ పుణ్యకార్యం తలపెట్టినా విజయవంతగా పూర్తి అవుతుందని నమ్మకం.



సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు జీవనాధారం అయిన సూర్యుడిని ఈ రోజు పూజిస్తే అప్పుల బాధలు, అనారోగ్యం, శత్రుబాధలు నశిస్తాయని చెబుతారు.