పాలకూర అతిగా తింటే ఈ ఆరోగ్యసమస్యలు తప్పవు



ఆరోగ్యకరమైన ఆహారం అంటే అందులో కచ్చితంగా ఆకుకూరలు ఉంటాయి.



వైద్యులు కూడా ఆకుకూరలు తినమని సిఫారసు చేస్తారు. అలా చెప్పారు అంటే నిత్యం అవే తినమని అర్థం కాదు, రోజులో ఒక పూట తిన్నా చాలు.



ఒకేరోజు పాలకూరను అధికంగా తీసుకుంటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు దాడి చేస్తాయి.



పాలకూరలో ఆక్సాలిక్ ఆమ్లం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో జింక్, మెగ్నీషియం, కాల్షియంలను బంధిస్తుంది. దీని వల్ల పోషకాహార లోపం తలెత్తవచ్చు.



ఆకుపచ్చని కూరలలో హిస్టామిన్ ఉంటుంది. ఇది అధికంగా శరీరంలో చేరడం వల్ల అలెర్జీ ప్రభావాన్ని ప్రేరేపిస్తుంది.



పాలకూరను ఒకేసారి అధికంగా తీసుకోవడం లేదా ఒకరోజులో విడతల వారీగా అధికంగా తినడం వల్ల శరీరంపై విషప్రభావం పడే అవకాశం ఉంది.



మీ కుటుంబ చరిత్రలో ఎవరికైనా కిడ్నీ రాళ్ల సమస్య ఉంటే మీరు పాలకూరను సరైన మోతాదులో తినాలి. అధికంగా తీసుకోకూడదు.



పాలకూరలో ఆక్సాలిక్ ఆమ్లంతో పాటూ, ప్యూరిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఈ రెండు సమ్మేళనాలు కలిసి గౌట్ అనే ఒక రకమైన ఆర్దరైటిస్‌ను ప్రేరేపించవచ్చు.



కాబట్టి పాలకూరను రోజులో మూడు పూటలా తినకూడదు. ఏదో ఒక పూట ఒక అరకప్పు కూర తిన్నా చాలు. కావాల్సిన పోషకాలు అందుతాయి.